సూసైడ్ చేసుకోవాలనుకున్న సమంత.. కారణం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ చాలా ఏళ్లు గా ఉన్న హీరోయిన్గా పేరు సంపాదించింది సమంత. మొదట్లో ఏన్నో సినిమాలను చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ తరువాత అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకుని అక్కడ కూడా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ఏమైందో తెలియదు కానీ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ మధ్యనే సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడి కొద్దికొద్దిగా కోలుకొని బయటపడింది.

Samantha: సమంత ఆత్మహత్య చేసుకోవాలనుకుందా ?

అయితే ఇప్పుడు ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వార్త ఎంత నిజమో అబద్దమో మనకు తెలియదు. కానీ సమంత సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేసిందట. ఈ విషయం నిజమేనా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నిజమేనా అంటే అవుననే చెప్పాలి. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సైంధు ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ జీవితానికి సంబంధించిన టాప్ సీక్రెట్స్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్న ఉమైర్ సంధు.. హీరోయిన్ సమంత డిప్రెషన్ లోకి వెళ్లి పోయిందని..సూసైడ్ చేసుకోవాలని అనుకుందని ట్విట్ చేశారు.

సోషల్ మీడియాలో ఈ వార్త విన్న తర్వాత ఆమె అభిమానులంతా నాగచైతన్య ఫ్యామిలీని తిట్టుపోస్తున్నారు. నాగచైతన్య ఫ్యామిలీ సమంత ను అంతగా బాధపెట్టిందా తను ఏ తప్పు చేసింది తనని ఇంతగా టార్చర్ చేయటానికి అంటూ ఆమె అభిమానులు ఆ ఫ్యామిలీ పై మండిపడుతున్నారు. ఈ మధ్యనే తను ఒక వ్యాధితో కోలుకొని బయటకు వచ్చింది కనీసం కాస్త కనికరం కూడా లేదా అంటూ చాలామంది నాగచైతన్యాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ విషయంతో మళ్లీ సమంత, చైతన్య డైవర్స్ విషయం బయటకు వచ్చింది. సమంత చాలా ధైర్యంగా ఉంటు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయదు అని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.<

/p>

Share.