నాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే ..అయితే ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది.. అంత టాలెంటెడ్ కలిగిన హీరోయిన్గా పేరు పెందింది.అయితే ఇప్పుడు ఈమె లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా సంపాదించుకుంది. మరి ఇమెకు ఈ బిరుదు ఎవరు ఇచ్చారు.. అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..
సాయి పల్లవికి ఈ పేరుతో ఇచ్చింది ఎవరో కాదు.. డైరెక్టర్ సుకుమార్.. డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన బిరుదుతో ఈమె మరింత పాపులారిటీ సంపాదించింది. ఇలాంటి సుకుమార్ ఆమెకు అన్యాయం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన.. విరుపాక్ష సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ చిత్రంలో ముందుగా సంయుక్తాకు బదులుగా.. సాయి పల్లవి తీసుకోవాలనుకున్నారట డైరెక్టర్ కార్తీక్ దండు.
ఈ సినిమాకు బ్యాక్ బౌన్ లాంటి పాత్ర ఇది అని అయితే ఈ విషయాన్ని సుకుమార్ కి చెప్పగా ఆయన వద్దన్నారట.సాయి పల్లవి తీసుకుంటే ఈ సినిమాలో ఇచ్చే ట్విస్ట్ ముందే తెలిసిపోతుంది. కాబట్టి ఎవరైనా కొత్త అమ్మాయి అయితే టాలెంటెడ్ హీరోయిన్ తీసుకోమని సలహా ఇచ్చారట. దీంతో కార్తీక్ దండు సంయుక్త మీనన్ తీసుకున్నారని సమాచారం. ఒకవేళ ఈ పాత్ర సాయి పల్లవి చేసి ఉంటే ఈమే క్రేజ్ మరింత పెరిగిపోయేది.
కానీ డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన సలహా వల్ల డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాలో ఆమెను తీసుకోలేకపోయారు.. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో సుకుమార్ ని ఎంత పని చేసావ్ అయ్యా సుక్కు అంటూ సాయి పల్లవి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మరి రాబోయే రోజుల్లో నైనా ఇలాంటి సరైన పాత్రని సాయి పల్లవి కోసం ఇస్తారేమో చూడాలి మరి.