మొదట టాలీవుడ్ లో ఏక్ నిరంజన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కంగాన రనౌత్.. ఇమే ప్రతి ఒక్కరికి సిపరిచితమే ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బాలీవుడ్ క్వీన్ గా పేరుపొందింది.. సినిమాలలో కంటే ఈ అమ్మడు ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే ఫేమస్ అయ్యిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోల మీద ఈమె ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటుంది.. ఈ కారణంగానే ఈమె స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను కోల్పోయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
కానీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మాత్రం పెట్టింది పేరుగా మారింది కంగాన రనౌత్.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగాన రనౌత్ పలు సంచలన ఆరోపణలు చేసింది.ఈమె మాట్లాడుతూ బాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్లు ఫ్రీగా సినిమాలు చేస్తారని ఎందుకంటే వారు ముందే నిర్మాతలతో కమిట్మెంట్ అయిపోతారని తెలియజేసింది.. కావాల్సినంత ముందే తీసేసుకొని ఏమీ తెలియనట్టుగా నటిస్తారని అందుకే వారంటే నాకు నచ్చదు అంటూ తెలియజేసింది కంగాన రనౌత్..
కానీ నేను అలా కాదు ఫ్రీగా చేయను నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తీసుకుంటాను.. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకునేది నేను మాత్రమే అంటూ తెలియజేస్తోంది. బాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు హీరోల చెప్పు చేతుల్లో ఉంటారు.వారు చెప్పినట్టుగానే వింటూ ఉంటారు ఎందుకంటే వారికి హీరోల తరపున అవకాశాలు రావాలనేదే వారి ఆశ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది కంగాన రనౌత్.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ పైన ఈ ముద్దుగుమ్మ ఇలాంటి వాక్యాలు చేయడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి.
కంగాన రనౌత్ సినిమాలు విషయానికి వస్తే తానే నిర్మాతగా ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే జయలలిత బయోపిక్ లో కూడా నటించి మంచి మార్కులు సంపాదించింది.. ప్రస్తుతం కంగాన రనౌత్ చేసిన ఈ వాక్యాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.