ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే.. ఈ ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంది. అలాంటి ఇంట్లో ఇప్పుడు పెళ్లి బాజా మోగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి కి పెళ్లి జరగబోతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అంతేకాకుండా వీరి పెళ్లికి మెగా కుటుంబ సభ్యులందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ సమాచారం..
ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థ వేడుకకు మెగా ఫ్యామిలీ అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం పలువురు సెలబ్రిటీలకు సన్నిహిత సభ్యులకు, కుటుంబ సభ్యులకు ఆహ్వాన పత్రికలు అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ వివాహం జరగబోతుందన్న వార్త తెలియటంతో విరిద్దరి అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.
అదేంటంటే లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ పెట్టారట మెగా ఫ్యామిలీ . మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్లకు లావణ్య త్రిపాఠి ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..అయితే మెగా ఫ్యామిలీ లావణ్య త్రిపాఠీకి ఏ కండిషన్ పెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించకూడదని కండిషన్ పెట్టారట. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం కావాలని చెప్పటంతో లావణ్య త్రిపాఠి నాకు వరుణ్ కన్నా ఏది ఎక్కువ కాదు నా కెరియర్ ని నేను వదులుకుంటాను అని చెప్పటంతో మెగా ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పుకున్నారట.
అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మెగా అభిమానులు మాత్రం చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాబోతోంది. కాబట్టి అదృష్టవంతురాలు అని అంటున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్లకు ఒప్పుకుందన్నమాట నిజమో కాదు తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారుతోంది.