టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.అయితే వాళ్లందరికీ లేని స్పెషల్ క్రేజ్ మాత్రం కొంతమందికే ఉంటుంది అలాంటి వారిలో ఐటెం సాంగ్ లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించిన ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకప్పుడు ఈమె పేరు చెబితే జనాలు పూనకాలు వచ్చేలా ఊగిపోయేవారు. అంతలా ఇమే క్రేజీ సంపాదించింది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో స్పెషల్ సాంగ్లు ఈ ముద్దుగుమ్మ నటించి ఓవర్ నైట్ కి స్టార్ సెలబ్రిటీగా పేరు సంపాదించుకుంది.
ఆ తర్వాత ముమైత్ ఖాన్ పలు చిత్రాలలో నటించి పలు సినిమాల్లో డాన్స్ కూడా చేసింది. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొన్న సక్సెస్ కాలేక పోయింది ముమైత్ ఖాన్ .అందరు ముమైత్ ఖాన్ ను ఐటెం గర్ల్ గాని చూస్తారే తప్ప ఎక్కడా కూడా ఈమెను ఒక నటిగా గుర్తించలేక పోయారు.అయితే ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన ముమైత్ ఖాన్ ఏం చేస్తుందో ఎక్కడ ఉందో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ముమైత్ ఖాన్ పుట్టి పెరిగింది ముంబైలో అవకాశాలు రావడంతో తన ఊరికి వెళ్లిపోయిందని అక్కడే సెటిల్ అయిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఖాన్ హోస్టు అడిగిన కొన్ని ప్రశ్నలకు దీటుగా సమాధానాలు తెలియజేసింది.. ముఖ్యంగా మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్న అడగగా.. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు పెళ్లయిన తర్వాత నుంచి అబ్బాయిలు మారిపోతారు పిల్లల్ని కనాలని టార్చర్కు గురిచేస్తారు పైగా మోటివేషన్ ఎంకరేజ్మెంట్ లాంటివి ఏవి దొరకవు.. ఏ పని చేయాలన్న అడ్డుగా ఉంటారని తెలుపుతోంది.
మొదట్లో తనకు వివాహంపై చాలా గౌరవం ఉండేదని కానీ ఆ తర్వాత అది పోయిందని అందుకే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగా లేనట్టు బోల్డుగా సమాధానాన్ని తెలిపింది ముమైత్ ఖాన్. ప్రస్తుతం ముమైత్ ఖాన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.