ఈ మధ్య ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు.. ఎందుకంటే చాలా మంది హీరో హీరోయిన్స్ విడాకులు తీసుకొని దూరం అవుతుంటే ఆ విడాకులు తీసుకున్న వారితోనే ప్రేమాయణం సాగిస్తున్నారు. అంతేకాదు వారిని రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో మొదటి దంపతులు నరేష్ ,పవిత్రలోకేష్ ఈ వయసులో కూడా ప్రేమ పెళ్లి అంటూ వార్తలో నిలుస్తూ ఉన్నారు.. కానీ ఇప్పుడు ఇలాంటివే ఎక్కువగా జరుగుతున్నాయి. విరే కాదు హన్సిక కూడా తన ఫ్రెండ్ భర్తని వివాహం చేసుకుంది.
సాంప్రదాయం ప్రకారం ఒకప్పుడు ఒకటే భర్త అని అనేవారు.. ఇప్పుడు విడాకులు తీసుకోవడం మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవటం జరుగుతోంది.. ముందు తొందరపడి ప్రేమించుకోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం ఇవన్నీ ఇండస్ట్రీలో కామన్ గానే మారుతున్నాయి. తాజాగా సంయుక్త మీనన్ కూడా విడాకులు తీసుకున్న హీరోతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
ఈ మధ్యనే తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాతో పరిచయమై బింబిసరా,సార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్గా విరూపాక్ష సినిమాలో తనలో ఉన్న మరో నటనని బయటపెట్టి దీంతో తెలుగు ప్రేక్షకులతో మంచి అభిప్రాయం సంపాదించుకుంది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, భాషల్లో సినిమాలు నటిస్తూ బిజీగా గడిపేస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ అమ్మడు నటిగా మంచి పేరు సంపాదించుకుంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ట్రోల్స్ లో నిలుస్తోంది..
కారణం పెళ్లయి విడాకులు తీసుకున్న హీరోతో ప్రేమాయణం నడిపిస్తూ పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది రహస్యంగా ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ ఈ వార్త విన్న అభిమానులు ఈమె కెరియర్ నాశనం చేసుకుంటోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై స్పందిస్తుందేమో చూడాలి మరి సంయుక్త మీనన్..