తెలుగు ప్రేక్షకులకు నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..గత కొద్ది రోజులుగా నటి కరాటే కళ్యాణి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం అడ్డుపెట్టుకొని మరి వార్తలలో నిలిచింది కరాటే కళ్యాణి.. ఈ క్రమంలోనే మా అసోసియేషన్ నుంచి ఆమెకు సస్పెండ్ లెటర్ కూడా రావడం జరిగింది. దీంతో ఆమె చాలా ఆవేదనను వ్యక్తం చేస్తోంది. తనపై కావాలని ఇలా కొంతమంది కుట్ర చేస్తున్నారు అంటూ ఆరోపించడం జరుగుతోంది. కరాటే కళ్యాణి గతంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలలో చిక్కుకోవడం జరిగింది.
అయితే ఇప్పటి వివాదంతో పోల్చుకుంటే గతంలో ఎన్నో కాంట్రవర్సీలు ఇమే పైన వినిపించాయి.. ముఖ్యంగా ఎలాంటి విషయంలోనైనా సరే ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది కరాటే కళ్యాణి. గతంలో ఈమె ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో జరిగేటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒక ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణికి ప్రశ్న ఎదురుగా అందుకు ఈ విధంగా సమాధానాన్ని తెలిపింది..
ఈ విషయంపై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు.టాలెంట్ ఉంటే ఎలాంటి చెత్త వెధవలకు లొంగాల్సిన అవసరం లేదంటూ తెలియజేసింది. మన టాలెంట్ కు మనకు అవకాశాలు తీసుకువస్తాయి.. అంతేకానీ ఐదు నిమిషాల సుఖం కోసం కకృతి పడవద్దు అంటు తెలియజేసింది. ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
కరాటే కళ్యాణి గతంలో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాలేదు.. కానీ ఎక్కువగా ఈ మధ్యకాలంలో రాజకీయాలలో కాంట్రవర్సీలలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. మరి రాబోయే రోజుల్లో నైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.