ఆ యాంకర్ ఉసురు తగిలే జబర్దస్త్ షో ఇలా అయిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఈ షో మొదటి నుంచే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది .కానీ ఇప్పుడు ఆదరించిన వాళ్ళే ఈ షో పై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు.మొదట్లో ఈ షో టిఆర్పి రేటింగ్ భారీగానే ఉండేది.. చాలామంది కమెడియన్స్ ఈ షో ద్వారానే తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఈ షో నుంచి వెండితెరపై అడుగుపెట్టి అక్కడ కూడా తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు.

Jabardasth Anchor Anasuya Bharadwaj Stunning Photoshoot | Andhra Vilas -  YouTube

ఇక సంపాదన విషయానికి వస్తే జబర్దస్త్ షోకి రాకముందు కనీసం వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు జబర్దస్త్ లోకి వచ్చిక సొంత ఇల్లు, సొంత కార్లు కొని సెటిల్ అయ్యారు.అయితే రాను రాను హద్దులు మీరుతూ కామెడీ ఉండడంతో..ఒకప్పుడు ఈ షో ని చూడాలంటే ఎంతో ఇష్టపడేవారు.. ఇప్పుడు ఈ షో చూడాలంటే భయమేస్తోందట..ఎందుకంటే అందులో శోభనం సీన్స్ అలాగే డబల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను భయపెడుతోంది.

అయితే ఈ షో కి జడ్జ్లు మారారు అలాగే కమెడియన్స్ కూడా కొత్త వాళ్లు వచ్చారు. అందుకే ఈ షో పై కొత్తగా విమర్శలు కూడా వస్తున్నాయి.కామెడీ అనేది నవ్వే అంతవరకే ఉండాలి హద్దులు మీరే దాకా ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో జబర్దస్త్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనసూయ ఉన్నప్పుడు ఈ షో బాగానే క్రేజ్ దక్కించుకుంది. కానీ ఆమెపై కూడా కామెంట్స్ చేస్తుంటే ఆ షోను వదిలేసింది.

అనసూయ స్థానంలో రష్మీ, సౌమ్యరావు ఉన్నప్పటికీ వారు అంతగా మెప్పించలేకపోతున్నారు. ప్రేక్షకులకు ఈ షోపై ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది. రేటింగ్ కూడా తగ్గిపోవడంతో మల్లెమాల ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.జబర్దస్త్ షో ని ఆపేసి ఈ షో ప్లేసులో సరికొత్త ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇదంతా అనసూయ వెళ్లాకే జరిగిందని అనసూయ ఉసురు తగిలిందేమో అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share.