జబర్దస్త్ యాంకర్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది యాంకర్ అనసూయ. తన అందంతో తన డాన్స్ తో జబర్దస్త్ షోలో సందడి చేసే అనసూయ గురించి చెప్పనవసరం లేదు. ఆ షో ద్వారా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న అనసూయ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. పుష్ప సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో అదరగొట్టింది. అనసూయ అటు షోలోను ఇటు సినిమాలలోనూ బిజీగా గడిపేస్తున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా మహా యాక్టివ్ గా ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనసూయ ను ఆంటీ ఆంటీ అని ట్రోల్ చేస్తున్నారు. అలా అనసూయను ఎందుకు పిలుస్తున్నారో అందరికీ తెలిసిందే.. అయితే అలాంటి ట్రోల్స్ ను ఏ మాత్రం పట్టించుకోని అనసూయ రీసెంట్గా ఫ్యామిలీతో ఫుల్ గా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ మధ్యనే తన కొడుకు పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసింది. ఈ సందర్భంలో ఫుల్లుగా లాగించిందట.దీంతో ఫుడ్ తిన్న క్యాలరీస్ ను కరిగించడానికి జిమ్ లో తెగ కష్టపడుతోంది అనసూయ. ఇదే మాటలను అనసూయ ఓపెన్ గా అభిమానులతో చెప్పుకొచ్చింది. ఫుడ్ చూసి ఫుల్లుగా టెంప్ట్ అయ్యి కుమ్మేసాను ఇప్పుడు క్యాలరీస్ కరిగించుకోవడానికి చాలా తంటాలు పడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫుడ్ చూసి కంట్రోల్ చేసుకోలేక ఫుల్ గా తిని ఇప్పుడు క్యాలరీస్ కరిగించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నానని అలా చేయకుండా ఉండాల్సింది అనసూయ రాసుకొచ్చింది. ఆమె చెప్పిన మాటలన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కొందరు ఆకతాయి కుర్రాళ్ళు అప్పుడు తినడం ఎందుకు ఇప్పుడు కరిగించడం ఎందుకు ఈ వయస్సులో నీకు ఇంత సాహసాలు అవసరమా..? ఇంట్లో కూర్చోవచ్చుగా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.