తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు కమలహాసన్ కూతురుగా పరిచయమైంది హీరోయిన్ శృతిహాసన్.. ఈ అమ్మడు అనగనగా ఒకదీరుడు సినిమా ద్వారా మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించడంతోపాటు స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఈమె హవ కొనసాగిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా శృతిహాసన్ హీరోయిన్ గా కంటే కాంట్రవర్సీల తోనే మంచి పాపులారిటీ సంపాదించింది. వాస్తవానికి ఈమెకు ఉన్న టాలెంట్ కి సౌత్ లో ఉండి ఉంటే ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉండేది.కానీ అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడంతో పాటు బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ స్టార్ హీరోయిన్గా రాణించాలని ఆశపడింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేకపోవడంతో అక్కడ సక్సెస్ కాలేకపోయింది శృతిహాసన్. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శృతిహాసన్ ఈమధ్య సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తోంది.
శృతిహాసన్ మీద చాలానే లవ్ ఎఫైర్ రూమర్లు కూడా ఉన్నాయి కానీ ఆమె వాటిపైన ఎప్పుడూ కూడా అసలు స్పందించలేదు. కానీ ఒకసారి మాత్రం వాటిపైన సీరియస్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.ఒక ఇంటర్వ్యూలో తాజాగా ఈ ప్రశ్నలు ఎదురుగా అందుకు సంబంధించి శృతిహాసన్ ఈ విధంగా తెలియజేసింది. శృతిహాసన్ మాట్లాడుతూ నేను గతంలో చాలామందితో రిలేషన్ లో ఉన్నాను.. అది నిజమే కానీ నాకు లవ్ కంటే కూడా పనిమీద శ్రద్ధ ఎక్కువ అది అవతలివారికి నచ్చేది కాదు అందుకే వారి నుంచి దూరంగా ఉన్నానని తెలియజేసింది.
ముఖ్యంగా మనం చేస్తున్న పనిని గౌరవించే వారితోనే మనం ప్రేమలో ఉండలనే విషయం అర్థమైందని తెలిపింది శృతిహాసన్. అలాంటి వారితోనే జీవిత భాగస్వామిగా చేసుకోవాలి లేకపోతే మన జీవితంలో చాలానే కోల్పోతామంటూ తెలిపింది శృతిహాసన్. ఎంతమందితో ఎఫైర్ నడిపిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు శాంతాను హాజరుకాతో డేటింగ్ లో ఉన్నది. వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం.