తెలుగు సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది నటి శ్రీరెడ్డి.. అయితే ఈమె పేరు వినగానే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె ఏం మాట్లాడినా సరే అది చివరకు కాంట్రవర్సీగానే మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈమె హీరోయిన్గా చేసింది కేవలం రెండు చిత్రాలే అయినా ఎక్కువ అవకాశాలు రాలేదు.. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ మీద మీటు ఉద్యమం చేయడంతో పెను సంచలనాలను సృష్టించింది శ్రీరెడ్డి. ముఖ్యంగా మెగా కుటుంబం మీద పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
అయితే శ్రీ రెడ్డికి వచ్చిన క్రేజ్ ను కాపాడుకోలేకపోయింది. హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఇండస్ట్రీ లో నుంచి ఇమేను బ్యాన్ చేయడం జరిగింది. దీంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో హీరోల పైన ఆరోపణలు చేస్తూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా తాజాగా శ్రీ రెడ్డికి సంబంధించి ఒక విషయం తెగ వైరల్ గా మారుతోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
గతంలో శ్రీ రెడ్డికి వివాహం అయ్యిందని ఈమె బ్యూటీ పార్లర్ పెట్టడం కూడా జరిగిందట.అయితే ఈమె బిహేవియర్ నచ్చని తల్లిదండ్రులు సైతం ఇమేను ఒప్పించి మరీ వివాహం చేసినట్టుగా సమాచారం. అయితే ఆ తర్వాత భర్తతో కొంతకాలం కాపురం చేశాక అతని బిహేవియర్ నచ్చక ఒక కూతురిని కన్న తర్వాత అతని నుంచి శ్రీరెడ్డి విడాకులు తీసుకొందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ కూతుర్ని మాత్రం తన భర్త వద్ద వదిలేసి వచ్చినట్టు సమాచారం.
ఇప్పుడు ఆమె కూతురు స్కూల్లో చదువుతున్నట్టు తెలుస్తోంది. ఇక భర్త కూతురు వదిలేసి ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ అవదామని ఎంట్రీ ఇవ్వగా చివరికి కాంట్రవర్సీ క్వీన్ గా మారిపోయింది. నిరంతరం ఎప్పుడు ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటుంది శ్రీరెడ్డి.. మరి ఈ విషయంపై నటి శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.