అప్పట్లో పలు చిత్రాలలో నటించిన హీరోయిన్ కస్తూరి ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఇప్పట్లో కూడా చాలా ఫేమస్ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇక ఈమెకు వివాహం చేసుకొని సెటిల్ అయినా తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని కేవలం సీరియల్స్ తోనే మొదలుపెట్టింది. ఇప్పుడు ఇంటింటా గృహలక్ష్మి అనే సీరియల్ లో కీలకమైన పాత్రలో నటిస్తోంది కస్తూరి. ఈ సీరియల్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక కస్తూరి వ్యక్తిగతంగా చాలానే కాంట్రవర్సీలలో చిక్కుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా అప్పట్లో న్యూడ్ గా ఫోటోషూట్ చేసి పెను సంచలనాలను సృష్టించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. టాలీవుడ్లో తాను చాలా సినిమాలలో నటించానని కానీ ఎవరు కూడా తనని ఇబ్బంది పెట్టలేదని తెలిపింది.. కానీ ఒక హీరో చేసిన పని వల్ల చాలా షాక్ అయ్యానని అతనితో రెండు మూడు సినిమాలలో నటించాను రెండో సినిమా షూటింగ్ చెన్నైలో జరిగింది అని తెలిపింది.
అలా షూటింగ్ సమయంలో చెన్నైలో ఒక హోటల్ రూమ్లో ఉన్నామని తెలిపింది ఒకరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ హీరో రాత్రి డ్రింక్ చేసి వచ్చి తన రూమ్ కు వచ్చారని తెలిపింది.. ఏమైనా మిస్ బిహేవ్ చేస్తాడేమో అని చాలా భయపడ్డాను కానీ ఆయన కాసేపు మాట్లాడి వెళ్లిపోయారని తెలిపింది. అయితే ఆ ఇన్సిడెన్స్ తనకు చాలా బాగా గుర్తుందని తెలియజేసింది కస్తూరి.
అయితే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా ఉన్నారు కాకపోతే ఆయన పేరు చెప్పడం తనకు ఇష్టం లేదంటూ తెలిపింది కస్తూరి. ప్రస్తుతం కస్తూరి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి కస్తూరి ఉన్న రూమ్ కి తాగి వెళ్లిన హీరో ఎవరు అంటూ పలువురు నేటిజెన్లు సైతం ఆరా తీస్తున్నారు.