టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా పేరు పొందిన హీరో నాని చెప్పాల్సిన పనిలేదు.. నాని ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఎక్కువగా సక్సెస్లే ఉన్నాయి. అయితే నాని మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత హీరో పొజిషన్ కు ఎదిగాడు. ఈ మధ్యనే దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగ పేరు సంపాదించారు.. నాని పై గతంలో సంచలన ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి.
శ్రీ రెడ్డి అంటే పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు ఆమె ఇండస్ట్రీలో ఒకటో రెండో సినిమాలను మాత్రమే చేసింది ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళలపై జరిగే విషయాలపైన స్పందిస్తూ ఉంటుంది.. ఒక్క నాని పై మాత్రమే కాదు ఇండస్ట్రీలో బడా హీరోలపై ఏదో ఒక ఆరోపణలు వేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి స్టార్ హీరో నాని తనతో శారీరికంగా పడుకున్నాడని గతంలో సంచలన ఆరోపణలు చేసింది.
అసలు విషయంలోకి వెళ్తే శ్రీ రెడ్డి హీరోయిన్ గా నటించిన అబద్ధం అనే సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా తనకి హీరోయిన్ గా సక్సెస్ కాలేదు.. దాంతో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని బిగ్ బాస్ షోలో అవకాశం కోసం వెయిట్ చేసింది. నాని దగ్గరకు వెళ్లి అవకాశం కోసం అడిగిందట.కానీ నాని తనతో శారీరికంగా కలవాలని కండిషన్ పెట్టాడంటూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే బిగ్ బాస్ లిస్టులో ఆమె పేరు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ రెడ్డి నాని నన్ని మోసం చేశారంట సంచలన ఆరోపణలు చేసింది.
అంతేకాకుండా ఓ మీడియాతో నాని నాతో పడుకోలేదని తన తల్లిదండ్రులపై ఒట్టేసి చెప్పమను అంటూ సంచలన ఆరోపణలు చేసింది.ఈమాటకు ఇండస్ట్రీ మొత్తం శ్రీరెడ్డిని తప్పు పట్టింది. ఆమె చెప్పే దాంట్లో ఎలాంటి నిజం లేదని రుజువు కూడా అయింది. అంతేకాకుండా నాని అభిమానులు నువ్వు ఫేమస్ కావడానికి మా నానిని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నావు అంటూ పలు కౌంటర్లు వేయడం జరిగింది. ఇప్పటికీ శ్రీరెడ్డి పలు విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది.