టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా విలన్ గా అన్ని క్యారెక్టర్లలో చేసిన నటుడు శరత్ బాబు.. ఈయన చాలా సినిమాలలో నటించి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. శరత్ బాబు తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ ,మలయాళం ,హిందీ పలు భాషలలో 250 కి పైగా సినిమాలలో నటించాడు. నిన్నటి రోజున మధ్యాహ్నం మధ్యాహ్నం శరత్ బాబు మృతి చెందడం జరిగింది.. మృతికి సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయనతో నటించిన నటులు నటీమణులంతా ఆయనని గుర్తు చేసుకుంటూ సంబంధించిన విషయాలను తెలుపుతున్నారు. చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. సినిమా పరంగా బాగానే ఉన్నా అందరికీ కష్టాలు సుఖాలు ఉన్నట్లే శరత్ బాబు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఈయన రమాప్రభ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆమె అప్పట్లో మోస్ట్ పాపులారిటీ ఉన్న లేడీ కమెడియన్లలో ఒకరు. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా చిన్న చిన్న క్యారెక్టర్ లను చేస్తూ అలరిస్తూనే ఉంది.
అంతేకాకుండా శరత్ బాబు కంటే రమాప్రభ ఐదేళ్లు పెద్దది. వీళ్ళకి పెళ్లి కాకముందే పలు సినిమాలలో వీరిద్దరూ నటించారు.అప్పట్లో శరత్ బాబుకి అవకాశాలు రాకపోవడంతో రమాప్రభ ఛాన్సులు ఇప్పిచ్చిందనే టాక్ అలా వాళ్ల లవ్ ట్రాక్ మొదలయ్యి పెళ్లికి దారితీసింది.. దాదాపు 14 ఏళ్లు కలిసి సహజీవనం చేశారు. వీరికి పిల్లలు కలగలేదు కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడిపోవడం జరిగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో శరత్ బాబు పాల్గొని అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.. మీకు అన్నిటికంటే మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే అవును మొదట నా పుట్టినరోజు.. ఆ తరువాత రమాప్రభ తో పెళ్లి జరిగిన రోజు.. అంటూ వారి అన్యోన్య దాంపత్యాన్ని గుర్తు చేసుకున్నారు.