టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా కళ్యాణ్ రామ్ తో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్ ..ఆ తర్వాత చందమామ సినిమాతో చెరగని ముద్రను వేసుకుంది.. ఆ తర్వాత మగధీర, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బృందావనం లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకుల ఆదరణను పొందింది. కాజల్ ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసి బెస్ట్ హీరోయిన్ గా నిలిచింది. ఒక తెలుగు తోనే కాకుండా తమిళ్, హిందీ భాషలలో నటించి తన అందంతో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది .
ఇండస్ట్రీలో ఈమె అందరితో మంచిగా మాట్లాడుతూ స్నేహంగా మెలుగుతూ ఉండేది. 2020లో గౌతమ్ కిచ్చులు అనే బిజినెస్ మాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది.అయితే అప్పట్లో కాజల్ లవ్ ఎఫైర్లు గురించి పలు వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మరుతున్నాయి. ఇండస్ట్రీలో మొట్టమొదటిగా కాజల్ అగర్వాల్ ఎఫైర్ ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి.. ఆ హీరో ఎవరో కాదు..రామ్ పోతనేని.. అంతేకాకుండా ఆయనతో లవ్ మాత్రమే కాకుండా రిలేషన్షిప్ లో కూడా ఉన్నారని అప్పట్లో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
రామ్ తో 2009లో గణేష్ అనే సినిమా లో నటించింది.ఆ టైంలోనే రామ్ తో లవ్ లో పడిందట.. ఆ తరువాత వారిద్దరూ కలిసి కొద్ది రోజులు సహజీవనం కూడా చేశారని సమాచారం..అయితే ఒక ఇంటర్వ్యూలో కాజల్ ని అడిగినా ప్రశ్న ఏంటంటే మీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఏడ్చిన సందర్భం ఏదైనా ఉందా అని అడిగితే దానికి కాజల్ అవును నా ప్రేమ విషయంలోనూ నా బాయ్ ఫ్రెండ్ విషయంలోనూ నేను చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొచ్చిందట .
ఇప్పుడు కాజల్ ఒకవైపు తన బిడ్డను చూసుకుంటూ చిన్న చిన్న సినిమాలను చేస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం కాజల్ చేతులు భారతీయుడు-2 బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో ఈమె పైన బాడీ షేవింగ్ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నట్లు తెలియజేసింది కాజల్ అగర్వాల్.