ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతోమంది సీనియర్ హీరోలతో జతకట్టిన ఈమె ఫైర్ బ్రాండ్ గా కూడా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సినిమాలలో అవకాశాలు లేక బుల్లితెరకే పరిమితమైన ఈమె పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా వాణిశ్రీ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరల్ గా మారుతుంది. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరో, హీరోయిన్ల మీద రూమర్ల అనేవి సర్వసాధారణం. ఒక హీరో, ఒక హీరోయిన్ కలసి రెండు మూడు సినిమాలలో నటించి వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అంటే ఇక వారి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు సృష్టిస్తారు.
ఇప్పుడు జరుగుతున్నది కొత్తేమీ కాదు.. గత కొన్ని దశాబ్దాలుగా ఇది ఇండస్ట్రీలో జరుగుతున్నదే. అయితే గతంలో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఇప్పుడున్న స్థాయిలో రూమర్లు అప్పుడు అంతలా ప్రచారం అయ్యేవి కాదు. అయితే అప్పట్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, వాణిశ్రీ విషయంలో కూడా జరిగిందట. కృష్ణంరాజు కెరియర్ ను మలుపు తిప్పిన చిత్రం కృష్ణవేణి.. ఇందులో వాణిశ్రీ హీరోయిన్గా నటించింది. అంతేకాదు ఈ చిత్రంలో వీరిద్దరి జంట గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో కృష్ణంరాజు, వాణిశ్రీ ఎక్కువగా సినిమాలలో కలిసి నటించారు.
ఇక తర్వాత భక్తకన్నప్ప సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి చరిత్ర సృష్టించింది. అలా ఏకంగా వీరి కాంబినేషన్లో 8 సినిమాల వరకు వచ్చాయి దాంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు కోడైకూసాయి. అయితే ఈ విషయం కృష్ణంరాజు ఇంట్లో వాళ్లకు కూడా తెలియడంతో వాళ్లు కూడా కృష్ణంరాజుని అనుమానించారట. అయితే ఆ తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తామిద్దరం స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు.