ఆ హీరోయిన్ తో నాగబాబు కొడుకు పెళ్లి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఒకప్పుడు వివాహం చేసుకోవాలంటే చాలా గ్యాప్ తీసుకునేవారు. ఇప్పుడు చాలా తొందరగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు హీరోయిన్స్.. ఈ మధ్యకాలంలోనే హీరో శర్వానంద్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

EXCLUSIVE: Varun Tej and Lavanya Tripathi to get engaged in June 2023;  Details Inside | PINKVILLA

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించి షూటింగ్ టైంలో ప్రేమలో పడడం జరిగిందట. ఇది పెళ్లి వరకు దారి తీసినట్లు సమాచారం.అయితే ఇదే వార్త పై పలు రూమర్లు కూడా వినిపించాయి.. కానీ ఈ వార్తను కొట్టివేయడం జరిగింది. కానీ ఇప్పుడు వీరు పెళ్లికే సిద్ధమవుతున్నారనీ సమాచారం.. వరుణ్ తేజ్ సోదరి నిహారిక వివాహానికి ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు హాజరు కాకపోయినా లావణ్య త్రిపాఠి మాత్రం ఈ పెళ్లికి స్పెషల్ గెస్ట్ గా హాజరై అట్రాక్షన్ గా నిలిచింది.

దీంతో వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కానీ ఈ వార్తలపై వారెప్పుడు స్పందించలేదు. కేవలం మేము స్నేహితులం మాత్రమే అంటూ చెబుతూ వచ్చారు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలోని ఈ ఏడాది జూన్ నెలలో వీరి నిశ్చితార్థం జరగబోతోందని అని తెలుస్తోంది.. అంతేకాకుండా ఈ ఏడాదిలోని వీరి వివాహం కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇలా వీరిద్దరి వివాహం జరుగుతుండటంతో అటు వరుణ్ తేజ్ అభిమానులు ఇటు లావణ్య త్రిపాఠి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Share.