టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్స్ వస్తూ పోతూ ఉంటారు. మరికొందరు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆ పట్టుకొని చెరగని ముద్రను వేసుకుంటారు. ఎవరైనా ఇండస్ట్రీలో చాలాకాలం కొనసాగాలంటే వారికి అందంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి వారి నటన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి హీరోయిన్స్ లలో తాప్సి ఒకరు.
తెలుగు ఇండస్ట్రీకి ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాని రాఘవేంద్రరావు తెరకెక్కించారు.. ఇంకా ఇందులో హీరో మంచు మనోజ్ నటించగా.ఈ చిత్రం రొటీన్ కంటెస్టెంట్ అయినప్పటికీ తాప్సి తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ హిట్లను సాధించింది. ఆ తరువాత ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రను పోషించింది. ఈమె తెలుగులో నటించింది. కొన్ని సినిమాలే అందులో సక్సెస్ అయినవి మాత్రం చాలా తక్కువే..
కానీ తమిళం మరియు హిందీలో మంచి సినిమాలను చేస్తూ సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అందులో అమితా బచ్చన్ తో చేసిన పింక్ కూడా ఉంది. ఈ సినిమా తెలుగులో వకీల్ సాబ్ పేరుతో పవన్ కళ్యాణ్ రీమిక్స్ చేసి పెద్ద హీట్ అందుకున్నారు.ఇదిలా ఉండగా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాప్సి తన మొట్టమొదటి చిత్రం ఝుమ్మంది నాదం అందులో రాఘవేంద్రరావు కోరినట్లు గా కొన్ని అందాలను ఆరబోస్తూ చేశాను కథ డిమాండ్ చేస్తే ఏది అవసరమైనా చెయ్యాలని తెలియజేసింది..
అప్పట్లో శ్రీదేవి ,జయప్రద లాంటి వారు ఎలా చేశారో నన్ను కూడా అలాగే చేయించారు. కానీ ఆయన ఇచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు నాకు నరకంలా అనిపించింది. చాలా ఇబ్బంది పడతాను వెరైటీ కాస్ట్యూమ్స్ అన్ని నా చేత వేయించారు రాఘవేంద్రరావు గారు అంటూ కొన్ని విషయాలను తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతున్నాయి.