తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పటి నుంచి ఇప్పటివరకు అగ్ర హీరోగా కొనసాగిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరి అండా లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఎంతో మంది హీరోలు వస్తున్నా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా ఈయనే నెంబర్ వన్ హీరోగా కొనసాగిస్తున్నాడు.
మెగాస్టార్ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకలను తట్టుకొని ఇప్పుడు ఈ పొజిషన్ కి ఎదిగాడు ఇక ఆయన అప్పట్లో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సాధించాయనే చెప్పాలి. ఇక ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడంటే ఆయనకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక మెగాస్టార్ కొడుకు అంటే ఇంకా ఆయన క్రేజ్ ఇంకో రేంజ్ లో ఉంటుంది.ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇక ఈయన మొట్టమొదటిగా చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తరువాత పలు సినిమాలలో నటించి సక్సెస్ లను కూడా సాధించాడు. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో గ్లోబల్ రేంజ్ కూడా పొందారు.
ఒకప్పుడు రామ్ చరణ్ ని చిరంజీవి కొడుకు అని అనేవారు. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అంటున్నారు. అంటే రామ్ చరణ్ క్రేజ్ అంత పెరిగిందని చెప్పవచ్చు. అంత క్రేజ్ పెంచుకున్న రామ్ చరణ్ సినిమాల కంటే చిరంజీవికి మరో హీరో నటన అంటే చాలా ఇష్టమట. ఆయన కూడా కొడుకే.. ఆ హీరో వరుణ్ తేజ్ ..ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు ఎన్నోసార్లు చెప్పారట చిరంజీవి. వరుణ్ లో నచ్చే విషయం ఏమిటంటే ఆయన నటన సహజంగా ఉంటుందని.. అలాగే వరుణ్ తేజ్ వైవిధ్యమైన పాత్రల్లో నటించడం తనకు ఇష్టమని తెలిపారు.. అయితే ఈ విషయం తెలిసి రామ్ చరణ్ తేజ్ ఒకింత సంతోషం వ్యక్తం చేసినా..మరొకవైపు ఎక్కడో జలస్ వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.