టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి మొదట ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ ముద్దుగుమ్మ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది కానీ ఈ మధ్యకాలంలో అన్ లక్కీ హీరోయిన్గా పేరును మూటగట్టుకుంటోంది. వరుస పెట్టి అవకాశాలు వస్తూ ఉన్న అన్నిటికీ ఓకే చెప్పేస్తే వరుస ప్లాప్లను మూటగట్టుకుంది.
దీంతో ఈమె కెరియర్ ప్రస్తుతం సందిగ్ధంలో ఉందని చెప్పవచ్చు ఈమె చేసిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. హ్యాట్రిక్ ప్లాపులను చవిచూసిన ఈ ముద్దుగుమ్మ. నాగచైతన్య తో కలిసి కస్టడీ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈనెల 12న విడుదలై డిజాస్టర్ గానే మిగిలింది. అయితే ఈ సినిమాలో ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
యాంకర్ మీరు కూడా సమంత లాగా ఐటెం సాంగ్స్ చేసే ఆఫర్ వస్తే చేస్తారా అని అడగగా.. నాకు అలాంటివి చేయడం అసలు ఇష్టం లేదు.. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలు నటించాను కానీ నానితో లిప్ లాక్ రొమాన్స్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు..చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. అలాంటి సమయంలోనే నాకు ఇష్టంలేని పనులు చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ నేను సంచలన వ్యాఖ్యలు చేసింది కృతి శెట్టి.. నాని అభిమానుల సైతం దీంతో ఈమె పైన ఫైర్ అవుతున్నారు.
ఉప్పెన సినిమా సమయంలో లిప్ లాక్ ఇచ్చావు కదా అప్పుడెందుకు ఇలా అనిపిలేదంటూ గాటుగా కామెంట్లు చేస్తున్నారు.. ఒక రకంగా నువ్వు నానిని అవమానించినట్టే అంటూ నాని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి చేసిన ఈ కామెంట్లు ఈమె కెరీర్నే దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. మరి ఏ మేరకు ఈ అమ్మడు సరైన సక్సెస్ను అందుకుంటుందేమో చూడాలి మరి.