టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా 15 సంవత్సరాలు పైనే కొనసాగిందని చెప్పవచ్చు. కథ నచ్చితే యంగ్ హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధంగానే ఉంది . అయితే గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు విజయవర్మతో ఈమె డేటింగ్ లో ఉందంటూ పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి .ఈ విషయంపై ఇప్పటివరకు ఏ ఒక్కరు క్లారిటీ కూడా ఇవ్వలేదు.

ఇక గతంలో వీరిద్దరూ ఎన్నోసార్లు చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సైతం తెగ వైరల్ గా మారాయి. ఎప్పటినుంచో తమన్నా వివాహం గురించి వస్తున్న వార్తల పైన కూడా తాజాగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. గోవా పార్టీలో వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడడంతో విజయవర్మ తమన్నా నిజంగానే ప్రేమలో ఉన్నారనే వార్తలు మరింత బలపడ్డాయి అలాగే పలు పార్టీలు, పబ్బులతోపాటు పలు సినిమాల ఫంక్షన్లకు కూడా హాజరవుతూ ఉన్నారు.
గడిచిన కొద్ది రోజుల క్రితం ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ మీడియా కంట పడ్డారు. దీంతో వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా విజయవర్మ తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.. విజయ వర్మ నటించిన దహద్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయవర్మ తమన్నాతో ప్రేమలో ఉన్నానని విషయాన్ని యాంకర్ ప్రశ్న అడగగా అందుకు సమాధానంగా నవ్వుతూ అవుననే సమాధానాన్ని తెలియజేశారు విజయ్ వర్మ.
ప్రస్తుతం విజయ వర్మ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.విజయవర్మ తమన్నా తో ప్రేమలో ఉన్నానని విషయంపై క్లారిటీ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అభిమానులు మాత్రం నెక్స్ట్ పెళ్లిపీట లెక్కపోయేది ఈ జెంటే అంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.