టాలీవుడ్ లోకి మొట్టమొదటిగా ఫిదా సినిమాతో పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. మొదటి సినిమాతోనే తన నటనని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాకుండా తన అందంతో తన డాన్స్ తో అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిల చాలా అందంగా కనిపించింది సాయి పల్లవి. ఇంకా చెప్పాలంటే సౌందర్య, సావిత్రి లాంటి గుర్తింపును సంపాదించుకుంది.అయితే సాయి పల్లవి మలయాళం లో ప్రేమమ్ అనే సినిమాతో పరిచయమయ్యింది.
ఆ తరువాతే తెలుగులో ఎంట్రీ ఇచ్చి పలు హీరోలతో ఏన్నో సినిమాలలో నటించి చెరగని ముద్రను వేసుకుంది. అయితే చివరగా విరాటపర్వం ,గార్గి సినిమా తరువాత ఇప్పటివరకు వేరే సినిమా అనౌన్స్మెంట్ రాలేదు.సాయి పల్లవి సినిమాలకు చాలా గ్యాప్ తీసుకోవటం వల్ల కొందరు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు తాజాగా సాయి పల్లవి త్వరలోనే ఓ సినిమాతో మన ముందుకు రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు శివ కార్తికేయంతో సినిమా చేస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది..
ఇది కాస్త పక్కన పెడితే ఇప్పుడు సాయి పల్లవి పెళ్లి గురించి కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 30 ఏళ్లు దాటుతున్నాయి ఇంట్లో వాళ్లంతా తనని ఒత్తిడి చేస్తుంటే సాయి పల్లవి మాత్రం తనకు వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తోందట.
అయితే తను పడి పడి లేచే మనసు సినిమా హీరో శర్వానంద్ తో ప్రేమలో పడిందని అలాగే వీరిద్దరూ సంవత్సరం పాటు డేట్ చేశారనీ కానీ అభిప్రాయాలు కుదరకపోవడంతో శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనీ పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి..అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆ సినిమా విడుదలయ్యాక చాలామంది ఇండస్ట్రీలో వీరిద్దరి ప్రేమ గురించి మాట్లాడుకోవడం జరిగింది.