తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించే హీరోయిన్లలో ముందుగా ఉండేది విజయశాంతి. ఇమే ఇండస్ట్రీకి మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఏ దానిలో తక్కువ కాదని నిరూపించిందని చెప్పవచ్చు. విజయశాంతి మెయిన్ లీడ్ లో చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయన్న సంగతి తెలిసిందే..విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మ సినిమా గురించి చెప్పనవసరమే లేదు. అప్పట్లోనే పిన్న సంచలనాలను సృష్టించింది.. నిర్మాతలకు కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. దాంతో ఆమెకి చాలామంది నిర్మాతలు లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించేవారు.
ఇక అప్పట్లో విజయశాంతి క్రేజ్ ఎలా ఉండేదంటే స్టార్ హీరోలకి ఎవ్వరికి ఇవ్వని రెమ్యూనరేషన్ ఇచ్చేవారుట.అప్పట్లో విజయశాంతికి దాదాపు కోటి రూపాయల పారతోషకం తీసుకునేదట. అప్పట్లో ఎ హీరో కూడ ఇంత రెమ్యునరేషన్ తీసుకునేవారు లేరట.విజయశాంతి నటనతో ప్రేక్షకుల్లో చెరుగని ముద్రను వేసుకుంది. ఆ తరువాత అగ్ర హీరోలకు పోటీగా ఆమె సినిమాలు అప్పట్లో విడుదలవుతూ ఉండేది.. అలాంటి విజయశాంతిని చూసి చాలామంది స్టార్ హీరోల సైతం కుళ్ళు కొనేవారట
విజయశాంతి తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ లను అందుకొని ఇప్పటికీ కూడా తన క్రేజ్ ను తగ్గకుండా చూసుకుంటోంది.ఆమె హీరోయిన్గా బిగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక స్టార్ హీరో ఆమెని లవ్ చేస్తున్నట్లుగా చెప్పారట.అలా చెప్పడమే కాకుండా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడట కానీ విజయశాంతి నాకు ప్రేమ మీద నమ్మకం లేదు అంటూ ఆయన చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లలేదట.. అలా ఆయన ఎన్నిసార్లు అడిగినా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఆ స్టార్ హీరో చేసేదేమీ లేక వేరొకరిని వివాహం చేసుకున్నట్లు సమాచారం.
అప్పట్లో ఆ స్టార్ హీరో తో కలిసి విజయశాంతి పలు చిత్రాలలో నటించేది.. విజయశాంతి బాలకృష్ణ దూరపు బంధువును వివాహం చేసుకోగా కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తోంది విజయశాంతి.