సింగర్ సునీత ఈమె సీనియర్ సింగర్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇక ఈమె గాత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ మధ్య పలు చిత్రాలతో బిజీగా ఉంటోంది.. ఈ మధ్యకాలంలోనే తను రామ్ వీరపనేని అనే అతన్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..వీరు పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత సునీత పరిమితంగా మూవీ ఆఫర్లకు ఓకే చెబుతున్నారు.
సునీత భర్త రామ్ వీరపనేని 1974లో జన్మించాడు. సునీత 1978లో జన్మించింది. అయితే వీరిద్దరి మధ్య నాలుగేళ్ల గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తోంది.. అయితే వీరిద్దరికీ నాలుగేళ్ల గ్యాప్ ఉన్నా కూడా ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. సునీత ఆస్తుల విలువ అటు రామ్ ఆస్తుల విలువ భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. సునీత పిల్లలు కూడా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కి రావాలని అలాగే సక్సెస్లను సాధించాలని సునీత ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సునీత ఒకవైపు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చేస్తూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. వీరపనేని సునీతకు మొదటి నుంచి మంచి స్నేహితుడు .ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రేమించుకుని సభ్యుల అంగీకరించటంతో ఎలాంటి సమస్యలు లేకుండా వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.సునీతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటే అటు రామ్ కు బిజినెస్ పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
వీరిద్దరి జోడి చూడముచ్చటగా ఉంటుందని పలువురు నేటిజన్స్ తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా సునీత అందం ఇప్పటికీ అందరిని ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే రామ్ వీరపనేని పలు సినిమాల్లో నటించారు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. సునీత కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు కూతురు ఒక సినిమాలో పాటలు పాడి ఆ తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్ళింది.