టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకి ఒక మంచి ఇమేజ్ ఉంది . కలెక్షన్ కింగ్ గా పేరు కూడా పొందాడు మోహన్ బాబు. అప్పట్లో తెలుగులో విల్లన్ గా,కమెడియన్ గా హీరోగా నటించారు.. మోహన్ బాబు కొన్ని వందల సినిమాలు పైగానే చేశాడు. ఈయన ఈయన కుమారులు మంచు విష్ణు ,మంచు మనోజ్ , మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా నిలిచే పెదరాయుడు లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకున్నాడు మోహన్ బాబు. ఇప్పటికీ ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.శ్రీకాంత్, మోహన్ బాబు హీరోగా నటించిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అప్పు చేసి పప్పు కూడు..ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతగా మోహన్ బాబుకు ఊహించని రీతిలో లాభాలు తెచ్చి పెట్టిందనే చెప్ప వచ్చు.
అయితే ఈ సినిమా సమయంలో ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుకు రూ .10 లక్షల రూపాయలు కట్టారట. అదేమిటంటే ..ఆర్తి అగర్వాల్ మోహన్ బాబుకు రూ .10 లక్షలు జరిమానా ఎందుకు కట్టారు అనే సంధ్యహం అందరికీ కలగవచ్చు.. అప్పటికే నిర్మాతగా కష్టాల్లో ఉన్న మోహన్ బాబు ఆప్పుచేసి పప్పుకూడు అనే సినిమానీ నిర్మించాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఆర్తి అగర్వాల్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే ఆర్తి అగర్వాల్ అప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన సినిమాను ఒప్పుకుంది.
ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రారంభం సమయం వచ్చేసింది. కానీ అప్పటికి ఆర్తి అగర్వాల్ పరీక్షలు ఉన్నాయి అంటూ కారణం చెప్పి తప్పుకుందట. కానీ ఆర్తి అగర్వాల్ పరీక్షలు ఉన్నాయని చెప్పి ఇతర సినిమా షూటింగ్లో పాల్గొనడం మోహన్ బాబుకు తెలిసింది. దీనితో ఈ విషయంపై ఫిర్యాదు చేయగా ఏకంగా రూ .10 లక్షల రూపాయలు మోహన్ బాబు కట్టాల్సి వచ్చిందట ఆర్తి అగర్వాల్..