సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ సైతం అప్పుడప్పుడు మోసపోతూ ఉంటారు.ముఖ్యంగా ప్రేమ వ్యవహారం డేటింగ్ విషయంలో కూడా మోసపోయినట్లు చాలామంది ఇప్పటివరకు తెలియజేయడం జరిగింది. దీంతో వీళ్ళ కెరియర్ కూడా నాశనం అవుతూ ఉంటుంది. అందుకే కొంతమంది హీరోయిన్లు సైతం మంచి హోదాలో ఉండగానే ఒక్కసారిగా డౌన్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయంలో కొన్ని రకాల మోసాలకు గురైన సందర్భాలను తెలియజేస్తూ ఉంటారు.
అలాంటి వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు.. టాలీవుడ్లో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన అంజలి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ తన అందంతో అందరిని ఆకట్టుకుంది. నటనపరంగా తన పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ నటిస్తూ ఉంటుంది అంజలి.. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. మొదట 2006లో ఫోటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె మళ్లీ ఎన్నో సంవత్సరాలకు వకీల్ సాబ్ చిత్రంలో నటించింది. అయితే అలా ఎన్నిసార్లు రీ యంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేక పోయింది అంజలి. దీంతో ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పవచ్చు దీంతో పలు వెబ్ సిరీస్ హర్రర్ చిత్రాలను నటిస్తోంది.
ఇక ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ భారీగానే పెంచేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినా కూడా అవకాశాలు రాలేదు. హీరోయిన్ అంజలి గతంలో మోసపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో కొడుకు తనని నమ్మించి మోసం చేశారని.. ఆ స్టార్ హీరో కొడుకు తనను లవ్ పేరుతో వాడుకొని వదిలేసారని సమాచారం.. దీంతో కొంతకాలం ప్రేమించుకున్న వీరు ఎప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉంటున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరనే విషయం అభిమానులు తెగ వెతుకుతున్నారు.