ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు తెలుగు మరొకవైపు తమిళ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల వచ్చిన PS -1, PS-2 సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న త్రిష ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. అదే స్టార్ పొజిషన్ ని కొనసాగిస్తూ ఉండడం విశేషం. ఇదిలా ఉండగా సినిమాలపరంగా సక్సెస్ అయిన త్రిష.. వ్యక్తిగతంగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఒకానొక సమయంలో ఎంగేజ్మెంట్ జరుపుకొని మరీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి అయింది.
ఒకప్పుడు వరుణ్ మణియన్ ప్రేమలో కొనసాగిన ఈమె ఆ తర్వాత అతనితో డేటింగ్ చేసి తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా ఇదే విషయం మళ్ళీ వైరల్ అవుతుంది. బిందు మాధవి న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు మే 12వ తేదీన రానున్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించగా అందులో ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. నిజమేనా ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
అయితే దీనిపై స్పందించిన బిందుమాధవి.. అవును.. వరుణ్ మణియన్ తో నేను డేటింగ్ లో ఉన్నాను. అయితే మేమిద్దరం ఒకేసారి అతనితో డేటింగ్ లో లేము.. త్రిష అతని నుంచి దూరమైన తర్వాతే నేను అతనితో డేటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఏదైనా సరే నిజం ఒప్పుకోవాల్సిందే కదా.. నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది కదా.. అంటూ డేర్ గా సమాధానం చెప్పింది బిందు మాధవి.. ఇకపోతే ఒక హీరోయిన్ ఇలా డేటింగ్ రూమర్లపై స్పందించడమే కాదు తాను నిజంగా డేటింగ్ లో ఉన్నానంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది బిందు మాధవి. ఇక బిందు మాధవి ముక్కుసూటితనానికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది విన్న మరి కొంతమంది మొత్తానికైతే ప్రేమ విషయంలో బిందు మాధవి త్రిషకు అన్యాయం చేసిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.