హీరో నాని అంజనా కంటే ముందు ఆ హీరోయిన్ ని ప్రేమించాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రూ.100 కోట్ల ఆశ కూడా దసరా సినిమాతో తీరిపోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సాధిస్తూ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. దీంతో నాని మార్కెట్ కూడా ప్రస్తుతం ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లేబర్లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా నానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Anjana Yelavarthy (Nani Wife) Wiki, Biography, Age, Family, Images - News  Bugz

అదేమిటంటే నాని భార్య అంజన అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే నాని అంజన కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిత్యమీనన్ అన్నట్లుగా తెలుస్తోంది. నాని నిత్యామీనన్ కలిసి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమా ద్వారా నటించడం జరిగింది. ఈ ముగ్గురికి ఈ సినిమా మంచి కెరియర్ను తీసుకువచ్చిందని చెప్పవచ్చు.

Actor Nani 75+ Cool New Photos And Wallpapers HD - IndiaWords.com

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాని నిత్యమీనన్ కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఒక హీరోయిన్ తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని.. ఒకవేళ నిత్యామీనన్ ను ప్రేమించిన విషయంతో ఆమెను ఎక్కడ సీక్రెట్ గా వివాహం చేసుకుంటాడని భయంతో నాని తల్లితండ్రులు వెంటనే అంజన అనే అమ్మాయితో వివాహం చేయించినట్లు సమాచారం . దీంతో నాని నిత్యామీనన్ కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి ఇద్దరు కూడా ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు. నాని ప్రస్తుతం తన 30 వ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. నిత్యమీనన్ కూడా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటిస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

Share.