బుల్లితెర యాంకర్ గా ఒకప్పుడు అలరించిన విష్ణు ప్రియ ఈమధ్య యాంకర్ గా కనిపించడంలేదు. పలు ఫోటోషూట్లను చేస్తూ తన అందాన్ని సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా పలు సినిమాల్లో నటించి మెప్పించిన విష్ణు ప్రియ వెండితెరపై మాత్రం తనదైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.అయితే రీసెంట్గా ఓంకార్ హోస్టుగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్-5 కి గెస్ట్ గా వచ్చిందివిష్ణు ప్రియ.
అయితే ఆ షోలో హీరో జేడీ చక్రవర్తి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.విష్ణు ప్రియ మాట్లాడుతూ.. జెడి చక్రవర్తి అంటే నాకు చాలా ఇష్టమని ..ఆయన ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఓంకార్ ఎందుకు నీకు ఆయన అంటే అంత ఇష్టం నీకంటే చాలా పెద్దవాడు కదా అని ప్రశ్నించాడు. దానికి విష్ణు ప్రియ నేను ఆయనతో ఒక వెబ్ సిరీస్ చేశాను. ఆ టైంలో ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు ఆయన ప్రేమలో పడ్డాను అని చెప్పింది విష్ణు ప్రియ.
అంతే కాకుండా ఈ విషయాన్ని జెడి చక్రవర్తికి చెప్పాను ఒక్కసారి బాంబు పేల్చింది విష్ణు ప్రియ.. అంతేకాదు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అంటూ ఓపెన్ గా చెప్పినా విష్ణు ప్రియ ని చూసి ఓంకార్ షాక్ అయ్యాడు. అయితే ఓంకార్ ఇలా ప్రశ్నించాడు ఆల్రెడీ జెడి చక్రవర్తికి పెళ్లి అయ్యింది కదా.. నీకు ప్రాబ్లం కాదా అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు తన మీద ప్రేమ ఉందని ఎప్పుడో ఆయనకి చెప్పాను. కానీ ఇంకా ఆయన నాకు రిప్లై ఇవ్వలేదు. అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు నీ ఫేస్ కి వాడే కరెక్ట్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.