రోజా -అల్లరి నరేష్ మధ్య బంధం ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎమ్మెల్యే రోజా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరయిన్ గా రాజ్యమేలింది. ఈమె పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యింది..రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆ తరువాత వైసిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి మెజారిటీతో గెలిచారు.ఆ తరువాత జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరించింది. ప్రస్తుతం మంత్రిగా రోజా ప్రజాసేవ చేస్తున్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత తన పూర్తి సమయాన్ని రాజకీయాల్లోనే కేటాయిస్తోంది. అయితే తాజాగా హీరో అల్లరి నరేష్ కు రోజాకు ఉన్న అనుబంధం గురించి వార్తలు వినిపిస్తున్న వాటి గురించి తెలుసుకుందాం.

Gossip Allari Naresh Roja Romance In Jabardasth Comedy Show | Hot gossips

అల్లరి నరేష్ ఈ వివి సత్యనారాయణకొడుకుగా మనందరికీ పరిచయం.అల్లరి నరేష్ కితకితలు సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత పలు కామెడీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య అల్లరి నరేష్ డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇంతకుముందే నాంది ఇప్పుడు ఉగ్రం లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

ఈమధ్య కామెడీ సినిమాలే కాకుండా ఇలాంటి వెరైటీ క్యారెక్టర్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు. రోజా, నరేష్ కలిసి శంభో శివ శంభో సినిమాలో నటించారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు రోజా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. తాను ఈవివి దర్శకత్వంలో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో నటించానని ఆ సినిమా సమయంలో అల్లరి నరేష్ స్కూల్ కి వెళ్లేవాడు అప్పట్లో అతడిని ఎత్తుకొని ఆడించే దాన్ని.. తన తండ్రి కూడా సినిమాల పరంగా అందరిని బాగా చూసుకునే వారిని తెలిపింది రోజా.అతి తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగారు నరేష్ అంటూ రోజా కామెంట్స్ చేసింది. ఎందుకంటే నాంది సినిమా ప్రమోషన్ లో భాగంగా జబర్దస్త్ షో కి వెళ్లి అక్కడ రోజాతో కలిసి డాన్స్ చేసి రోజాని ఎత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది

Share.