టాలీవుడ్ లో అక్కినేని వారసులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈమధ్య వారు తీసే సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. బడా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి కనీసం మిడిల్ రేంజ్ హీరోలుగా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. కనీసం నాగచైతన్య కొన్ని సినిమాలలో చేసి హీరోగా ఏదో ఒక గుర్తింపును పొందాడు. కానీ అఖిల్ మాత్రం అడపా దడపా సినిమాలను చేసి పెద్దగా అభిమానులను సంపాదించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కావడం ఎంతో బాధాకరం.
ఈ మధ్యకాలంలో అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందించబడింది. ఆ సినిమా విడుదలై అట్టర్ ప్లాప్ ను మిగులుచుకుంది. ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోవటంతో ఇండస్ట్రీలో అఖిల్ నిలదొక్కుకోవడం కష్టమే అంటూ చాలామంది సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవైపు నాగార్జున మరోవైపు నాగచైతన్య ఇంకోవైపు అఖిల్ వీరందరి కెరీర్ ఇలా అవ్వటానికి ప్రధాన కారణం ఆ ఇద్దరు ఆడవాళ్లే అంటూ తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య, సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్న మొదట్లో సమంతను అనుమానించినప్పటికీ ఈ మధ్యకాలంలో నాగచైతన్య పై ఎక్కువ రూమర్స్ వినిపిస్తున్నాయి.
అఖిల్ విషయానికొస్తే శ్రీయ భూపాల్ అనే అమ్మాయి ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే శ్రీయ, అఖిల్ సీక్రెట్స్ తెలుసుకుని తనతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందట. ఒకవైపు నాగచైతన్య కి అవకాశాలు లేక సతమతమవుతున్నాడు. మరోవైపు అఖిల్ కి సినిమా అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆయన తీసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్లే మిగిల్చాయి.. అఖిల్ కి నాగచైతన్య కి సమంత, శ్రియ పాపమే శాపంలా తగిలిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.