నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు సంపాదించిన నటులలో బాలయ్య కూడా ఒకరు. అప్పట్లో బాలయ్య నటించే సినిమాలన్నీ కూడా ఒక సంచలనాన్ని సృష్టించేవి.. బాలయ్య ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకు వెళ్తూ కుర్ర హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తు మంచి విజయాలను అందుకుంటున్నారు. 60 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ బాలయ్య కుర్ర హీరో లాగా నటిస్తే డ్యాన్స్ తో అద్భుతమైన నటనత డైలాగులతో అందరిని ఆకట్టుకుంటున్నారు.
అందుకే బాలయ్య సరసన హీరోయిన్గా నటించే అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు సైతం నటించేందుకు ఓకే చెబుతున్నారు. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం బాలకృష్ణతో నటించిన హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ కెరియర్ లో చెన్నకేశవరెడ్డి సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇందులో హీరోయిన్లుగా టబు ,శ్రియ నటించారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు.అయితే ఈ సినిమాల ముందుగా టబు ప్లేస్ లో హీరోయిన్ రమ్యకృష్ణ అని ఆ పాత్ర కోసం అనుకున్నారట.
అయితే ఆ క్యారెక్టర్ నేను చేయనని డైరెక్టుగా చెప్పేసిందిట రమ్యకృష్ణ అందుకు ప్రధాన కారణం బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తూ ఉండడంతో పాటు.. బాలయ్య తండ్రి సరసన హీరోయిన్గా నటించడానికి ఒప్పుకోలేదట.. అసలు కారణం ఏమిటంటే అప్పటికే ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది ఆ సమయంలో బాలకృష్ణ తండ్రి పాత్రకి రమ్యకృష్ణ అది కూడా ఓల్డ్ పాత్రలో నటించాల్సి ఉన్నందువల్ల ఈ పాత్ర నటిస్తే తన సినీ కెరియర్ నాశనమవుతుందని ఊహించి ఈ పాత్రకి ఓకే చెప్పలేదని తెలుస్తోంది.
అందుచేతనే రమ్యకృష్ణ పాత్రలో టబు నీ తీసుకోగా కొడుకు పాత్రకు హీరోయిన్గా శ్రియ నీ తీసుకోవడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయంగా నిలిచింది ఈ చిత్రం. ఈ మధ్యకాలంలో రమ్యకృష్ణ పలు సినిమాలో కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.