సినీ ఇండస్ట్రీలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు ఎలాంటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా హీరోయిన్ గా కంటే ఈ ముద్దుగుమ్మ విలన్ గానే పలు సినిమాలలో బాగా కనెక్ట్ అయింది. గతంలో క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి తన క్రేజీని పెంచుకోవడంతో పాటు ఈమె కెరీర్ కు కూడా టర్నింగ్ పాయింట్ అయింది. ముఖ్యంగా తన బాడీ ఫిట్నెస్ విషయంలో హీరోయిన్ గా కంటే విలన్ గానే పాత్రలు బాగా సెట్ అవుతాయని ఈమె భావించి ఇలాంటి వాటికి ఎక్కువగా మక్కువ చూపుతోంది.
ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల తరఫున నటిస్తూ దూసుకుపోతోంది వరలక్ష్మి శరత్ కుమార్.. రీసెంట్గా తమిళ హీరో కి తల్లిగా చేయడానికి కమిట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక స్టార్ హీరోతో అన్నట్టుగా సమాచారం. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ధనుష్ కు ఎలాంటి పేరు ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్టు అన్నట్లుగా ఈ మధ్యకాలంలో మారిపోయింది.
రీసెంట్గా సార్ సినిమాలో చాలా కూల్ క్లాస్ గా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలాంటి క్రమంలోనే తన తదుపరి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఆయనకు తల్లిగా నటించబోతున్నట్లు సమాచారం. ధనుష్ చైల్డ్ క్యారెక్టర్ పాత్రలో తల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన బాగుండడంతో తల్లిపాత్రకు కూడా ఓకే చెప్పిందని సమాచారం. అయితే అభిమానులు మాత్రం విలన్ పాత్రలకే మంచి పాపులారిటీ ఉంది వాటినే సెలెక్ట్ చేసుకోవాలంటే ఈమె అభిమానుల సైతం కోరుకుంటున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ అభిమానులు మాత్రం ఈమె వివాహం ఎప్పుడు అవుతుందా అంటూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో నటుడు విశాల్ తో ఈమె ప్రేమాయణం నడిపినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ వట్టి రూమర్లే అంటూ తెలియజేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.