మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలాకాలం తర్వాత నటించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత వచ్చిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మంచి హైప్ ఏర్పరచుకుంది. సాయి ధరంతేజ్ తమ్ముడు పంజా వైష్ణవి తేజ్ కూడా వరుసగా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.. వీరిద్దరూ కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే మంచి మంచి సినిమాలలో నటిస్తున్నారు. అయితే సాయి ధరంతేజ్ తల్లితండ్రుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఆయన తల్లి విజయదుర్గ భర్త పంజా ప్రసాద్ అయితే వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే రీసెంట్గా సాయి ధరంతేజ్ తల్లి ఒక డాక్టర్ను రెండో వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరి విడిపోవడానికి మెగా కుటుంబమే కారణమంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి స్టార్ హీరో కాకముందు పంజా ప్రసాదుతో విజయదుర్గ పెండ్లి జరిపించారు. అయితే పంజా ప్రసాద్ ఫ్యామిలీ చాలా ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉండేది. పైగా వెస్ట్ గోదావరి మొత్తం ఆయనకు బాగా పేరు ఉందట.
కానీ చిరంజీవి పెద్ద స్టార్ హీరో అయిన తర్వాత మెగా ఫ్యామిలీ అల్లుడికి కొన్ని కండిషన్లు పెట్టిందట.. తాము చెప్పినట్టు వినాలను కొన్ని కండిషన్లు పెట్టడంతో అది నచ్చని ప్రసాద్ తన భార్యకు విడాకులు ఇచ్చేసినట్లు సమాచారం.కానీ కొడుకులను మాత్రం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా తన ఆస్తిలో భాగంగా కొడుకులకు వాటా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ కు యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన దగ్గరుండి అన్ని చూసుకున్నట్లు సమాచారం.
అయితే ఆరోజు మెగా ఫ్యామిలీ కండిషన్లు పెట్టకుంటే ఈరోజు సాయి ధరంతేజ్ తల్లితండ్రులు కలిసి ఉండే వారిని సాయి ధరంతేజ్ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. సాయి ధరంతేజ్ వివాహం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.