ఏ ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్గా రాణించాలని చాలామందికి ఉండనే ఉంటుంది. కానీ ఆ స్థాయికి రావడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. ఎంతో మంది ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న వారు వారి కెరియర్లో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ సందర్భాలు ఉన్నాయని తెలియజేస్తూనే ఉన్నారు.. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వస్తున్న వారికి ఇది కచ్చితంగా ఒక సమస్య అని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇప్పుడు కాస్త ట్రెండు మారిపోయింది మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది ఈ విషయం పైన స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ఇలాంటి లిస్టులో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఈమె పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి మొదట పంజాబీ సినిమాలలోనే తన కెరియర్ను ప్రారంభించింది. కానీ ఇప్పుడు తెలుగులో బాగా పాపులర్ అయింది. గతంలో ఈమె పంజాబీలో ఒక యాడు కోసం ట్రై చేస్తున్న సమయంలో ఆ యాడ్ డైరెక్టర్ ఆడిషన్ కి పిలిచారట.
అయితే ఆడిషన్ కి వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైందట ఆ డైరెక్టర్ ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టారట ఏదో సీన్ చెప్పే ప్రయత్నంలో ఆమెను అసభ్యంగా తాగారని.. అలాగే తనని రూమ్ కు వస్తావా ఛాన్స్ ఇస్తానంటూ కూడా చాలా దారుణంగా మాట్లాడారట.దీంతో పాయల్ కు చాలా భయం వేసి అక్కడ నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఆ డైరెక్టర్ వద్దకు వెళ్లకుండా కేవలం తన సొంత టాలెంట్ తోనే సినిమా అవకాశాలు సంపాదించుకున్నది.
అలా మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగులో సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఎక్కువగా బోల్డ్ పాత్రలోనే నటిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోలను చూసి అభిమానులు సైతం షాక్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేయడం జరిగింది.