కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగతి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం వినిపిస్తూనే ఉంది.ఈ విషయంపై ఎంతోమంది నటీమణులు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూసే వారికి ఇవి ఎక్కువగా ఎదురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మీటూ ఉద్యమం తర్వాత చాలామంది ఈ విషయాలను బయటకు తెలపడం జరిగింది. కొంతమంది హీరోల పైన కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

Pragathi in blue silk saree at F3 Pre release event! | Fashionworldhub

మరి కొంతమంది అయితే పేర్లు చెప్పకుండా కేవలం తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా నటి ప్రగతి కూడా క్యాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ కామెంట్లు చేసింది.. ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ప్రగతి క్యాస్టింగ్ కౌచ్ మీద పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.. నటి ప్రగతి మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని విషయాన్ని కరెక్ట్ గా చెప్పలేను.. కానీ ఎప్పుడైనా సక్సెస్ లో ఉన్నవారు క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించరు..

కానీ అవకాశాలు లేని వారు మాత్రమే ఇలాంటి విషయాల పైన చెబుతూ ఉంటారు..నిర్మాతలు ఇలాంటి వాటికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టరు కదా కేవలం ఐదు నిమిషాల సుఖం కోసం హీరోయిన్లపై కోట్లు ఖర్చు పెట్టరు కదా అంటూ తెలిపింది. అక్కడ ఆ పాత్రకు వారు సూట్ అయితే కచ్చితంగా వారికి అవకాశం ఇస్తారు అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయంపై పలువురు అభిమానులు ప్రగతికి కూడా ఎదురైన ఏదైనా అనుభవం గురించి తెలియజేయాలంటే కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం తెగ వైరల్ గా మారుతోంది.

Share.