నాగబాబు కూతురు నిహారిక ఈ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు.ఈమె టాలీవుడ్ లో కొన్ని సినిమాలను చేసి అవి సక్సెస్ కాక వాటికి పులిస్టాప్ పెట్టింది. ఆ తరువాత సిద్దు జొన్నలగడ్డను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అయితే ఈమధ్య నిహారిక వార్తలు నిలుస్తూనే ఉంది. తన భర్తతో విడాకులు తీసుకోబోతోందని వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది.అంతే కాకుండా గత కొంతకాలంగా సోషల్ మీడియా కు దూరంగా ఉంటున్న నిహారిక ఈ మధ్యనే సోషల్ మీడియాలో విడాకుల కారణంగా యాక్టివ్ అయ్యారు.
ఇక అంతే కాకుండా నిహారిక గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నది .ఒకవైపు విడాకుల వార్తలు మరోవైపు ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరవుతోంది. ఇకపోతే నిహారిక తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. అదేమిటంటే “ఐలవ్ యు డెత్ బంగారం” అని కామెంట్స్ పెట్టడం జరిగింది.ఈ వీడియో చూస్తే జిమ్ చేసి నిహారిక అలసిపోయినట్టు అర్థమవుతోంది. ఈ వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇంతకు ఆ బంగారం ఎవరు ఈమె మెసేజ్ ఎందుకు పెట్టింది ఈ వీడియో షేర్ ఎందుకు చేసిందంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకు నిహారిక అంత ప్రేమ కురిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు అంటూ ఈ వీడియో పైన పలు అనుమానాలకు కారణం అవుతోంది.సోషల్ మీడియా ద్వారా ఇన్ డైరెక్ట్ గా నిహారిక హింట్ ఇస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇటీవల నిహారిక తన కొత్త ప్రొడక్షన్ హౌస్ ను కూడా మొదలుపెట్టింది. హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిహారిక షేర్ చేసిన ఈ వీడియో క్లారిటీ రావాలంటే ఆమె స్పందించాల్సి ఉంటుంది.