టాలీవుడ్ లో హీరోయిన్ సమంత వ్యవహారంపై ఈ మధ్యకాలంలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంది ఈమె ముక్కు చీదుకుంటూ టిష్యూ పేపర్ చాటున మొహాను దాచేసి తనకు ఆరోగ్యం బాగా లేదంటూ పెద్దగా ఏమీ అడగవద్దు అంటూ సమాధానాలను తెలియజేస్తూ ఉండడంతో పాటు.. కేవలం తన సినిమాలు మాత్రమే ఆదరించండి అంటూ డైలాగ్ చెబుతూ వెళ్ళిపోతుంది..ఇక సరిగ్గా యశోద సినిమా సమయంలో కూడా తనకు గల వ్యాధిని బయటపెట్టి సానుభూతి కోసం ఎంతో ట్రై చేసింది సమంత.
ఇలా ఈమె ఒక రోగిష్టిగా చేసిన సానుభూతితో ఈ సినిమాను మాత్రం నెట్టుకొచ్చింది. ఏదో రకంగా యశోద సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. ఈ సినిమా కంటే ముందు అక్కినేని కుటుంబంతో తెగతెంపుల కారణంగా సమంత పైన చాలా నెగెటివిటీ కూడా రావడం జరిగింది. ఇదంతా బాగానే ఉన్నా ఆమెలో మంచి నటి ఉంది ఎన్నో సినిమాలు తీసిన కంటెంట్ బాగుంటే చూస్తారు లేదంటే లేదు అని చెప్పవచ్చు. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్ కోసం అమెరికాకు వెళ్లి అక్కడ మతిపోయే అందాలతో దుస్తులతో హాట్ ఫోటోలను సైతం చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
ఇక్కడేమో జాలీ గా మొహం పెట్టి.. ప్రమోషన్ చేస్తావు.. అక్కడేమో సినిమా ప్రమోషన్స్ ను హాట్ గా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. దీంతో ప్రేక్షకులను పిచ్చివాళ్లను చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాల కోసం ఏదైనా చేస్తారా అంటూ పలువురు నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈమె పైన సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. సెలబ్రిటీలకు మాత్రం రోగాలు రావా వస్తే ఇలాంటి పబ్లిసిటీ చేసుకోవాలా అంటూ నేటిజన్స్ సైతం ఫైర్ అవుతున్నారు
సినిమా ప్రమోషన్స్ లోనే ఇలాంటి రోగాలు కనిపిస్తాయి ఎక్కడలేని ఏడుపు వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన శాకుంతలం సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఇకమీదట సినిమా ప్రమోషన్లు చేసేవారు ఆలోచించి చేయాలంటూ పలువురు నేటిజెన్లు ఫైర్ అవుతున్నారు.