టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లకు ఒకప్పుడు మంచి మంచి ఆఫర్లు వస్తూ ఉండేవి. ఇప్పుడు తెలుగమ్మాయి అంటే ఆఫర్లు చేజారిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు కాకుండా ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన హీరోయిన్ల కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తెలుగు అమ్మాయి అయ్యి ఉండి ఆఫర్లు లేక రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది హిరోయిన్ మాధవి లత. ఈమె నటించిన నచ్చావులే సినిమాతో తెలుగు హీరోయిన్ గా పరిచయమైంది . ఆ తరువాత నాని హీరోగా నటించిన స్నేహితుడా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఈమె తెలుగు అమ్మాయి అవ్వడంతో డైరెక్టర్లు ఈమెను పెద్దగా పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేసిన హీరోలతో అవకాశాలు రాకపోవటంతో ఇండస్ట్రీకి దూరమయింది.సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి చేరువయ్యింది మాధవి లత. ఈమె బీజేపీ పార్టీలో చేరి క్రియా శీలకంగా ఉంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి కొన్ని విషయాలను పంచుకుంది. మాధవి లత ను యాంకర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ..? అంటూ అడగగా.. చాలామంది అభిమానులు ఆమెను ఈ ప్రశ్న అడుగుతున్నారని తెలిపింది.. దానికి ఆమె దేవుడు ఎప్పుడు మంచి వ్యక్తిని చూపిస్తాడో అప్పుడు పెళ్లి చేసుకుంటనని సమాధానం తెలిపింది.
అయితే కొంతమంది మాత్రం నేను చెప్పేది వినకుండా నేను వేరే విధంగా మాట్లాడితే వారు ఇంకో విధంగా అపార్థం చేసుకుంటున్నారు. సపోజ్ నాకు పెళ్లి ఇష్టం లేదు. అని అంటే మీకు పెళ్లి మీద నమ్మకం లేదా అయితే మీ తల్లిదండ్రులు చేసుకున్నది పెళ్లి కాదా అంటూ మాట్లాడుతున్నారు. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో చెప్పింది కూడా ఊరికే ఆనీ వాస్తవానికి తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేరని తెలిపింది… పెళ్లి టైం వస్తే తప్పకుండా చేసుకుంటానని మాధవి లత మాటల్లో తెలిపింది.