బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ శ్రీముఖి యాంకర్ రవి జోడీకి ప్రత్యేకంగా స్థానం ఉండేది. వీరిద్దరూ ఎన్నో షోలు కూడా చేయడం జరిగింది. అవన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. శ్రీముఖి అయితే ప్రస్తుతం అన్ని చానల్స్ లో కూడా తన హవా కొనసాగిస్తూనే ఉన్నది. గతంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలోనే శ్రీముఖి అంటే గిట్టని వారు కొంతమంది తన తాలూకా జ్ఞాపకాలను ఫోటోలను తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి- రవి మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు. వీరిద్దరు హోస్టుగా చేసిన పటాస్ షో మంచి విజయాన్ని అందుకుంది. ఈషో ద్వారా ఎంతోమంది లైఫ్ టర్నింగ్ అయిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షో చేస్తున్న సమయంలో శ్రీముఖి, రవి కోసం చిన్నపిల్లలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న సమయంలో కొన్ని బూతు పదాలను డబల్ మీనింగ్ డైలాగులను వాడుతూ టిఆర్పి రేటింగును అమాంతం పెంచేస్తూ ఉండేవారు.
ఇంకా చెప్పాలి అంటే శ్రీముఖి పేరు పాపులర్ లోకి వచ్చింది ఈ షో వల్లే అని చెప్పవచ్చు. ఈ కారణంగానే ఈమెకు బిగ్ బాస్ లో కూడా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడి కెరియర్ మారిపోయింది. అప్పట్లో రవి, శ్రీముఖి చేసిన కొన్ని స్కిట్లలో భాగంగా క్లిప్స్ ని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరుగుతోంది. అప్పట్లో యాంకర్ రవి శ్రీముఖి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కూడా వార్తలు వినిపిం చాయి. అంతేకాకుండా వీరిద్దరూ హద్దులు మీరీ ప్రవర్తించడం కూడా పలు కారణాలకు దారితీసింది.
అయితే ఈ మధ్యకాలంలో రవి యాంకర్ శ్రీముఖి మాట్లాడుకోవడం లేదని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యాంకర్ రవి డిమాండ్ తగ్గిపోవడంతో పాటు అవకాశాలు కూడా రాలేదు. కానీ శ్రీముఖి మాత్రం తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ అవకాశాలను సంపాదించుకుంటోంది.