సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో స్టార్ గా రావాలన్నా లేకుంటే అవకాశాలు ఎక్కువగా రావాలన్న హీరో హీరోయిన్స్ చాలా కష్టపడాలి. వీరు మాత్రమే కాదు క్యారెట్ ఆర్టిస్టులు ఇలా చాలా కష్టపడితేనే ఇండస్ట్రీలో అవకాశాలు వెలుపడతాయి.చాలామంది సెలబ్రిటీలు సినిమా ఆఫర్లు రాక ప్రేమలో ఫెయిల్యూర్ తో చాలా మంది చిన్నవయసులోనే చనిపోయిన వారు ఉన్నారు.
కొందరికి ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు సినిమాల్లో ఒకటి రెండు అవకాశాలు వచ్చి మళ్లీ రాకపోవడం వలన సతమతమవుతూ మరణించిన వారు ఉన్నారు. ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించిన వారిలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ కూడా ఒకరు. ఈమె ఓ కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు.ఈమె కెరీర్ 2000 సంవత్సరంలో ఇంద్ర ధనుష్ అనే కన్నడ చిత్రంతో పరిచయమైంది.
ఇండస్ట్రీలో రెండేళ్లుగా కొనసాగిస్తూనే పలు సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఈమెకు మంచి అవకాశాలు దక్కటంతో ఇండస్ట్రీలో బిజీగా హీరోయిన్ గా మారిపోయింది.. అలాంటి సమయంలోనే ఒక కొరియోగ్రాఫర్తో ప్రేమలో పడింది మోనాలి.. కానీ తన ప్రేమ సఫలం కాకపోవటంతో ఆత్మహత్య చేసుకుందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
మోనాల్ 2022 ఏప్రిల్ 14వ తేదీన తన గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈమె చనిపోయి 20 సంవత్సరాలు కావడంతో.. సిమ్రాన్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు సిమ్రాన్తన చెల్లెలితో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేస్తూ నిన్ను ఎప్పటికీ మర్చిపోలేము ప్రేమకు గుర్తుగా నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten 😘 pic.twitter.com/4E78Ol6PZz
— Simran (@SimranbaggaOffc) April 14, 2023