టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా గుర్తింపు పొందిన నటి ప్రేమ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ప్రేమ అప్పట్లో పలు సినిమాలలో నటించి అచ్చ తెలుగు అమ్మాయిగా..ఎనలేని అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది నటి ప్రేమ.అయితే ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరమై కుటుంబ ఆలన పాలన చూసుకుంటోంది.. అయితే అప్పుడప్పుడు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తు ఉంటుంది ప్రేమ. ఇదిలా ఉండగా తాజాగా ఒక షోలో పాల్గొన్న ప్రేమ తన కెరీర్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి స్పందించింది.
ఈ సందర్భంగా నటి ప్రేమ మాట్లాడుతూ నాకు సినిమాలంటే ఇష్టం లేదు.. నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు. మా అమ్మ బలవంతం వల్లే నేను సినిమాల్లోకి వచ్చాను. ఆమె నన్ను నటిగా చూడాలని అనుకుంది. ఆ విషయంపై చాలాసార్లు నేను అమ్మ గొడవ పడ్డాను. కానీ నాకు ఆమె కోరికను ఎందుకు తీర్చకూడదని అనిపించింది. అలా మొట్ట మొదటిసారిగా సవ్యసాచి అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చాను.
ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మరిన్ని అవకాశాలు వచ్చి ఎన్నో సినిమాల్లో నటించాను. అయితే అరుంధతి సినిమాలో క్యారెక్టర్ జేజమ్మ గురించి మాట్లాడుతూ జేజమ్మ పాత్ర కోసం ముందుగా నన్ను సంప్రదించారు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు.. కానీ అప్పటికే కన్నడలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ కాక ఆ పాత్రను వదులుకున్నాను అని చెప్పింది నటి ప్రేమ.
అరుంధతి సినిమా విడుదలైన తరువాత చూశాను. ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆ పాత్ర నేను చేయలేకపోయానని నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆ పాత్ర నాకు రాసి పెట్టలేదు కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అని చెప్పుకొచ్చింది ప్రేమ.