Radhika Apte..టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో ఉండే లో క హీరోయిన్స్ అయినా కొన్ని సంవత్సరాలకు ఫేస్‌లో కానీ బాడీలో కానీ కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించాలంటే వారి శరీర ఆకృతి పర్ఫెక్ట్ గా ఉండాలి.. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ఇలాంటి టాపిక్ మీదే వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte).. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువ వివాదాల మీద పాపులర్ అయింది.
రాధిక ఆప్టే సౌత్ ఇండస్ట్రీ గురించి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ డిఫరెన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మళ్లీ వార్తలలో నిలిచింది. ఈమె కొన్ని సినిమాలతో, వెబ్ సిరీస్ లతో బోల్డ్ రోల్స్ లో నటించి మెప్పించింది. ఒకప్పుడు రాధిక ఆప్టే మూవీ అవకాశాల కోసం ఏన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది.
ఈమె ఆఫర్ల కోసం తిరిగే సమయంలో తన ముక్కును షేప్ చేయించుకోవాలని .. అలాగే తన వృక్షోజాలను సైజు పెంచుకోవాలని అప్పట్లో కొంతమంది దర్శక నిర్మాతలు సలహాలు ఇచ్చారట.. సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మరెన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తన మీద తనకే అసహ్యం వేసిందని తెలిపింది. కానీ తన పట్టుదలతోనే సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యానని రాధిక ఆప్టే తెలుపుతోంది.
అక్కడ కొంతమంది ప్రవర్తనను చూసి సినిమాలకు దూరం కావాలని అనిపించేదని తెలుపుతోంది రాధిక ఆప్టే. రాధిక కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది.. సినిమాలోనే కాకుండా ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ షాక్ ఇస్తూ ఉంటుంది.