టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న విషయం తెలిసిందే .ఆయన ఈ మధ్యకాలంలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఇంకాస్త అభిమానులను సంఖ్య పెరిగిపోయింది. అయితే ఇప్పుడు భోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణను త్వరలో పూర్తి చేయనున్నారు. అలాగే చిరంజీవికి, తన కొడుకు రామ్ చరణ్ కి కార్లు అంటే ఎంత మోజో చెప్పాల్సిన పనిలేదు.. విలాసమంతమైన గ్యారేజీలో విదేశీ కార్లకు కొద వేమీ లేదు. ఈ మధ్యనే చిరంజీవి కి రామ్ చరణ్ రోల్స్ రాయిస్ అనే కార్ని బహుమతిగా ఇచ్చాడు. వారి గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి.
అన్ని కార్లు ఉన్నా కూడా కొత్త మోడల్స్ కారు వచ్చిందని తెలియగానే వాటిని కొనడానికి ఆత్రుత చూపిస్తున్నారు చిరంజీవి. ఇదే టయోటా వెల్ ఫైర్ దాదాపు రూ 1.2. కోట్లతో ట్రెండీగా వచ్చింది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరంజీవికి ఫాన్సీ నెంబర్ కావాలని 4.7 లక్షలు చెల్లించాడు.Tso9GB 1111 రిజిస్టర్ చేసుకున్నారు. ఏదేమైనా అంత మంచి ఫ్యాన్సీ నెంబర్ దొరికినందుకు చిరు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
టాలీవుడ్ లో ఈ కారు చాలామంది సెలబ్రిటీలు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ కార్ కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విలాసమంతమైన కారుతోపాటు అదిరిపోయే ఫీచర్స్.. స్టైలిష్ డిజైన్తో ఆకర్షిస్తోంది. వైల్ ఫైర్ ఇలాంటి కార్ని చిరంజీవి సొంతం చేసుకున్నందుకు అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. అలాగే వారికి ఫ్యాన్సీ నెంబర్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఫ్యాన్సీ నెంబర్ కి అన్ని లక్షలు అవసరమా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.