తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అలాగే తన వారసుడు అయినా రామ్ చరణ్ కి కూడా అంతే పేరు ప్రఖ్యాతలు అభిమానులు ఉన్నారు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. అయితే రామ్ చరణ్ కి పెళ్లి అయ్యి దాదాపు 10 ఏళ్ళు అవుతోంది. వీరు ఎప్పుడూ అన్యోన్యంగా, ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నారు.. ఇక ఉపాసన అయితే మెగా ఫ్యామిలీకి మంచి కోడలిగా సర్దుకుపోయే గుణం సహాయం చేసే మనసు అన్నీ కలబోసి ఉన్నాయి.
ఉపాసన కూడా అభిమానులతో మంచి బంధం ఏర్పరచుకుంది. దాదాపు వీరికి పెళ్లయి పదేళ్లు అవుతున్న పిల్లల గురించి ఎన్నో అవమానాలను , అభిమానుల నుంచి ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొన్నారు. అయినా ఈ ప్రశ్నలన్నింటికీ ఎప్పటికప్పుడు సమాధానాలను ఇస్తూ వీరిద్దరి మధ్య బంధం చాలా గట్టిదని నిరూపించారు.అయితే ఈ మధ్యకాలంలోనే ఉపాసన ప్రెగ్నెంట్ అనే వార్త వచ్చిన విషయం తో మెగా అభిమానులు కాస్త సంతోషపడ్డారు. అయినప్పటికి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తోంది. తను తీసుకొనే ఫోటోల నుంచి తను తీసుకుంటున్న ఫుడ్ వరకు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అభిమానులు కూడా తనకు జాగ్రత్తలు చెబుతూ సలహాలను అందిస్తూ ఉంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వార్త వైరల్ గా మారుతోంది.. అదేంటంటే ఉపాసన జాతకంలో దోషం ఉందని తెలిసింది.ఆమెకు బాబు పుడితే కలిసి వస్తుందని పాప పుడితే కలిసి రాదు అనే వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఈ విషయం విన్న మెగా అభిమానులు మాత్రం చాలా భయపడుతున్నారు. మరికొందరు ఇవన్నీ మూఢనమ్మకాలు, పుకార్లు అంటూ కొట్టి పడేస్తున్నారు. మరి ఇలాంటి విషయాల పైన మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.