బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా పలుకమెడియన్స్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. అంతేకాకుండా జబర్దస్త్ షో కి కొత్త కమెడియన్స్ వస్తూ పోతూ ఉన్నారు.బుల్లితెర సీరియల్స్ నటులు కూడా ఈ షో కి హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు. బుల్లితెర సీరియల్స్ లో నటించిన అమర్ దిప్ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలా పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉంటారు.
అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు అమర్ దీప్… అయితే ఇప్పుడు ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .. అది ఏమిటంటే అర్ధరాత్రి రోడ్డుపై జబర్దస్త్ నటి బుల్లితెర నటి..రీతూ చౌదరితో చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.ఈమధ్య అమర్ దీప్ తన భార్య సమయం దొరికినప్పుడల్లా వీడియోలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు.
ఇక అమర్ దీప్ బాదుషా సినిమాలో బ్రహ్మానందం చేసిన రీల్ చేసి కడుపుబ్బ అందరిని నవ్వించాడు. రీతు దసరా సినిమాలో కీర్తిసురేష్ చేసిన బరాత్ డాన్స్ చేసి రీతు అందర్నీ అలరించింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తమిళ్ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అమర్ దీప్ నటన డాన్స్ యాక్టింగ్ చాలా బాగా చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇలా వీరిద్దరూ యుగానికి ఒక్కడు సినిమాలోని పాటకు కలిసి రీల్స్ చేయటంతో వీరిద్దరూ ఏమైనా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.
ఇలా రోడ్డుమీద స్టెప్పులు వేయడంతో రీతూ చౌదరి పైన పలువురు నెటిజెన్స్ సైతం రోడ్డు మీద కూడా అందచందాలను వలకబోస్తూ రచ్చ చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది రోడ్డు మీద అలా డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు నువ్వు సూపర్ రీతు చౌదరి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram