Anishka..టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క(Anushka) శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికీ 40 ఏళ్ళు వస్తున్న ఈమె ఇంకా తెలుగులో కుర్ర హీరోలతో నటిస్తు బిజీగా ఉంటోంది. అయితే ఈ మాత్రం ఇంకా వివాహ విషయంలో ఇప్పటికీ గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ పడుతున్నారు. అయితే గతంలో కూడా అనుష్క పెళ్లి పైన ఎన్నో రూమర్లు కూడా వినిపించేవి.. కానీ అవి ఇప్పటివరకు నిజం కాలేదు. ముఖ్యంగా అనుష్కకు టాలీవుడ్ లో హీరో ప్రభాస్ మధ్య ఏదో నడుస్తోందని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
అందుకే వీరిద్దరికీ ఇంకా వివాహం కాలేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. భవిష్యత్తులో వీధిద్దరు వివాహం చేసుకుంటారేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిర్చి సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాహుబలి సినిమా సమయంలో ఆ ప్రేమ మరింత బలపడిందని టాలీవుడ్ లో వార్తలు ఇప్పటికీ వైరల్ గా మారుతూ ఉంటాయి. కానీ ప్రభాస్ కంటే ముందు అనుష్క హీరో నాగార్జున ప్రేమలో పడిందని వార్తలు గతంలో వినిపించాయి. వీరిద్దరి కాంబినేషన్లో కలిసి డాన్ ,డమరుకం వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా రూమర్సే..
అయితే అనుష్క, ప్రభాస్ తో ప్రేమలో పడడానికి ఉండే నాగచైతన్య తో కూడా ప్రేమలో ఉండేదని సమాచారం.. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డారని వీరి ప్రేమకు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలు కేవలం సోషల్ మీడియాలో రూమర్లు గాని మిగిలాయి. దీంతో అనుష్క, నాగార్జున ఇంటి కోడలు కాబోతోంది అంటూ ఎక్కువగా ప్రచారంలో వినిపించాయి.
కానీ ఇదంతా రూమర్లు మాత్రమే అప్పట్లో ఒక ప్రముఖ చానల్స్ అయినటువంటి ఆంజ్యోతి పేపర్ లో ఈ వార్తలు వినిపించాయి .ఈ విషయంపై నాగార్జున అగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఆంజ్యోతి పత్రిక కూడా ఇలా రాయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు నాగార్జునకు స్వయంగా ఆం*జ్యోతి యాజమాన్యం నాగార్జునకు క్షమాపణలు చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. మరి ఈ ఏడాదైనా అనుష్క తన వివాహంతో అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.