ఒకప్పుడు హీరోయిన్లుగా చలామణి అయ్యి.. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడంతో వివాహం చేసుకొని శాశ్వతంగా ఇండస్ట్రీకి దూరమైన ఎంతోమంది హీరోయిన్లు అప్పుడప్పుడు దర్శనమిస్తూ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో హీరోయిన్గా నటించిన విమల అలియాస్ మల్లికా అందరికీ గుర్తు ఉంటుంది. 2004లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. ఇకపోతే మల్లికా తన నటన ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను పూర్తిగా తన వశం చేసుకుంది.. ఎంతలా అంటే సినిమా పేరు చెప్పగానే ఈమె టక్కున గుర్తొచ్చేస్తుంది . అంతలా తన నటనతో ఆకట్టుకుంది ఇక ఈ సినిమాలో రవితేజ స్కూల్ డేస్ జీవితంలో విమల క్యారెక్టర్ లో నటించింది.
ఇక తర్వాత మరి ఏ తెలుగు సినిమాలో కూడా ఈమె నటించలేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయి చెరగని ముద్ర వేసుకున్న ఈమె అందం, అమాయకత్వం, సహజ నటనతో వెండితెరపై అలరించింది.
ఇక అందం, టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రాకపోవడంతో మల్లికా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం భర్త బాబుతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ తరం ప్రేక్షకులలో చాలామందికి మల్లికా ఎవరన్నది తెలియదు కానీ ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు.
కేరళకు చెందిన ఈమె తెలుగుతోపాటు తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఇక తమిళంలో గుండక్క మందక్క, తోట, తిరుపతి వంటి ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించింది. మలయాళం లోకూడా ఈమె నటించింది. అంతేకాదు బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్ లో నటించింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన మల్లికా కుటుంబానికే పరిమితమైంది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలలో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.