టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటి సారిగా గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అల్లు అర్జున్.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ పొజిషన్ కు ఎదిగాడు. అల్లు అర్జున్ నటించిన ఆర్య, ఆర్య 2, బన్నీ ,దేశముదురు,రుద్రమదేవి, పుష్ప ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో నటించి తన స్టామినా నిరూపించుకున్నారు. ఇక వీటన్నింటితో ప్రేక్షకాదరణ పొందాడు బన్నీ
అంతేకాకుండా వారి పెదనాన్నతో డాడీ సినిమాలో డాన్సర్ గా కూడా నటించాడు. అల్లు అర్జున్ పలు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. బన్నీ సినిమా వస్తున్నాయంటే థియేటర్ల ముందు అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు..పుష్ప రెండు భాగాలుగా తేరకేక్కుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పుష్ప1సంచలన విజయాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. ఇప్పుడు పుష్ప-2 కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్
అయితే తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప -2 టీజర్ను రిలీజ్ చేశారు సుకుమార్ .ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే.. అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.చాలా సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. కానీ ఒక్క సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలేదట .అదే గుణశేఖర్ దశకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమా
..ఆ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనకు తెలుసు అందులో అనుష్క, రానా మరికొంతమంది ప్రధాన పాత్రలో పోషించారు. అల్లుఅర్జున్ అయితే ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించి ఆ సినిమాకే వన్నెతెచ్చాడు. అయితే ఈ సినిమాలో నటించటానికి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదట. కారణం ఏమిటో తెలియదు కానీ ఒకప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలోనే వరుడు సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. బన్నీకి ఆ సినిమా ద్వారా నిరాశే మిగిలిందని చెప్పాలి. అందుకే గుణశేఖర్కు ఫ్రీగా ఈ సినిమా చేశారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.