Samantha..టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో సమంత(Samantha )కూడా ఒకరు . సమంత మావోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన పడ్డ సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందినీ తెలియజేసింది సమంత.. కానీ అంత లోపలే మరీ సమంత కు ఏదో ఒక సమస్య వచ్చి పడుతోందినే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనను చూస్తే సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో సమంత కళ్ళలో నుంచి ఉన్నట్టుండి నీరు కారడం కళ్ళు మంట ఉండటం వంటివి జరుగుతున్నాయని తెలియజేసింది.. అంతేకాకుండా ఫోటోలు తీసేటప్పుడు ఫ్లాష్ లైట్లను చూస్తే వెంటనే కళ్ళ నుండి నీరు వస్తాయని ఇంటర్వ్యూలో తెలిపింది.ఒకప్పుడు మాయో సైటిస్ తో పోరాడుతూనే యశోద సినిమాను పూర్తి చేసింది సమంత. ఇప్పుడు కళ్ళతో బాధపడుతూనే శాకుంతలం సినిమాని పూర్తి చేసింది.
ఇక శకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.. ఇందులో సమంత శకుంతలం పాత్రను పోషించగా దుష్యంతుడి పాత్రను మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ గుణశేఖర్ మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ,టీజర్, ట్రైలర్లను చూసిన అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.సమంతా కి సినిమా పై ఉన్న మక్కువతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తన సినిమాలన్నీ పూర్తి చేసుకుంది.
శాకుంతలం సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. మరోవైపు సిటాడేల్ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా షూటింగ్ కు హాజరవుతూ బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే ఇటీవల శాకుంతలం ట్రైలర్ విడుదల కోసం ముంబై వచ్చిన సమంత ఫోటోగ్రాఫర్ల కంటపడింది. ఆమె ఫోటో కోసం ఎగబడిన ఫోటోగ్రాఫర్లు వెంట వెంటనే కెమెరాలు ఫ్లాష్ లైట్స్ వేస్తూ ఫోటోలకు తీస్తూ ఉండడంతో.. సమంత తీవ్రంగా ఇబ్బంది పడింది. కళ్ళను చేతులతో అడ్డం పెట్టుకొని కవర్ చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది
View this post on Instagram